Financial assistance | ఈనెల 22న నగదు జమ

Financial assistance | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22వ తేదీన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది.

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో మొత్తం రూ.10,120.78 కోట్లు జమ చేయనున్నారు.

ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.13,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

విద్యార్థుల చదువులకు ఆర్థిక తోడ్పాటు అందించడం, పాఠశాల విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ అనుసంధానం వంటి వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.