అత్యవసర వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..

..అంబులెన్స్ తనిఖీ చేసిన అధికారి

కేసముద్రం, ఆంధ్రప్రభ : అత్యవసర వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో క్షణక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందేననీ 108 ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజురుద్దీన్ సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం కేసముద్రం మండల కేంద్రంలోని 108 అత్యవసర అంబులెన్స్‌ను తనిఖీ చేశారు. ఏ క్షణంలోనైనా ప్రాణాలు కాపాడేందుకు సిద్ధంగా ఉండాల్సిన వాహనం కండిషన్‌ను, అందులోని అత్యవసర వైద్య పరికరాలు, మందుల నిల్వలను పోగ్రామ్ మేనేజర్ స్వయంగా పరిశీలించారు. రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజురుద్దీన్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు 108 ఒక సంజీవని లాంటిది. 24 గంటల పాటు ఉచిత అత్యవసర సేవలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందాలి. అంబులెన్స్‌లో ప్రతి నిమిషం మందులు, కీలక వైద్య పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. విధి నిర్వహణలో అలసత్వాన్ని అస్సలు సహించబోం అని స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ బత్తిని మహేష్, పైలెట్ కంచ రవి, ఈఎంటి రౌతు నవీన్ తదితరులు పాల్గొన్నారు.