రఘునాథపల్లి పరమశివుడికి ప్రత్యేక పూజలు..

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండల కేంద్రంలో గల శ్రీ మహాదేవ స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం అత్యంత అరుదైన మహా శివయోగ్యం రోజు కావడంతో తెల్లవారుజాము నుండి మహిళ భక్తులు ప్రజలు శివాలయంకు రావడంతో సందడే సందడి నెలకొంది. మండలంలోని వివిధ శివాలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో ఆలయ పూజారి పిండిపోలు శ్రీనివాస్ శర్మ నేపథ్యంలో అభిషేకాలు అర్చనలు చేశారు.

ఆలయ కమిటీ చైర్మన్ కూరెళ్ల పెద్ద ఉపేందర్ గుప్తా రేణుక దంపతులు పరమాశివుడికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యాలు సమర్పించారు. వారు మాట్లాడుతూ శివపార్వతుల ఆశీస్సులుతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దేవుని కోరారు.

మహిళా భక్తులు ప్రత్యేకంగా ఆలయం రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు చింతకింది కృష్ణమూర్తి రాజేశ్వరి దంపతులు, ప్రముఖ వ్యాపారవేత్త కూరెళ్ళ వేద కుమార్ రాధ, కూరెళ్ల వినయ్ కుమార్ వాణి దంపతులు, కందుల అనిల్ కుమార్, బాల్నే పరశురామ్ గౌడ్, లగిశెట్టి లింగయ్య, కడారి చిన్న నాగేష్, పోకల పోషణo, పేర్ని లెనిన్ దీపిక దంపతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.