Vaishali Nagar Underpass | వైశాలి నగర్ అండర్‌పాస్ క్లోజ్
20 రోజుల పాటు రాకపోకలు బంద్..
జూలై 16 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు
రోడ్డు విస్తరణ, వర్షపు నీటి కాలువ పనుల కోసం నిర్ణయం..
ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని పోలీసుల సూచన
Vaishali Nagar Underpass | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సైబరాబాద్ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్‌ను 20 రోజుల పాటు మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. జూలై 16 నుంచి అండర్‌పాస్‌లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. రోడ్డు విస్తరణతో పాటు వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో వర్షాల సమయంలో అండర్‌పాస్‌లో నీరు నిలిచే సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
అండర్‌పాస్ మూసివేత నేపథ్యంలో వాహనదారులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రద్దీని నివారించేందుకు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
