BRS | కుటుంబానికి రూ.6 లక్షల భరోసా

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్
మృతిచెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కుటుంబానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు అందజేసిన సబితా ఇంద్రారెడ్డి
ఎనికెపల్లి కరంచంద్ కుటుంబానికి పార్టీ తరఫున ఆర్థిక సహాయం..
కరంచంద్ కుటుంబానికి రూ.6 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు

BRS | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్‌గా పనిచేసిన కరంచంద్ మృతిచెంద‌డంతో కుటుంబానికి పార్టీ తరఫున ఆర్థిక భరోసా అందించారు. రంగారెడ్డి జిల్లా ఎనికెపల్లి గ్రామానికి చెందిన కరంచంద్ ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబానికి సహాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.6 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లను అందజేశారు.

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కరంచంద్ కుటుంబ సభ్యులకు ఈ బాండ్లను అందించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, వారి కుటుంబాల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా పార్టీ నేతలు తెలిపారు.

కరంచంద్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సోషల్ మీడియా వేదికగా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని నేతలు గుర్తు చేశారు. కేటీఆర్ ఇచ్చిన మాట మేరకు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల కుటుంబ సభ్యులు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.