ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన చేనేత సంఘం నూతన కమిటీ

వలిగొండ (ఆంధ్రప్రభ): వలిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి చేనేత సహకార సంఘానికి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దొంత శ్యామ్‌సుందర్, కార్యదర్శి గంజి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు జెల్ల నరహరితో పాటు కుల పెద్దలు, పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం చేశారు.

సంఘం అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరగా, చేనేత కార్మికుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.