ఘనంగా ఎంపీ మల్లు రవి జన్మదిన వేడుకలు..

వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, డిసిసి ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డిల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిబద్ధత కలిగిన ,క్రమశిక్షణ కలిగిన నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా, ప్రతిక్షణం ప్రజల క్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధి పై దూరదృష్టి గల నాయకుడు ఎంపీ మల్లురవి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, సీనియర్ నాయకులు, వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షులు పర్వత్ రెడ్డి,మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షురాలు భాగ్యమ్మ ఫూల్ సింగ్ నాయక్,ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, నాయకులు కృష్ణ ముదిరాజ్, తిరుపతి రెడ్డి, పుల్లయ్య, వార్డు సభ్యులు గుద్దేటి కిష్టాల్, ముదిగొండ రమేష్, యువ నాయకులు నరసింహ, చందు నాయక్, సక్రు నాయక్, గజిని శ్రీను, కడారి శ్రీనివాస్ యాదవ్, ఈదులపల్లి శ్రీనివాసులు వివిధ గ్రామాల సర్పంచులు, మరియు ఉపసర్పంచ్ లు , ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.