లంక కాలువలో తూటు తొలగింపు పనులు..
పెడన, ఆంధ్రప్రభ: పెడన నియోజకవర్గంలోని పెడన మండలంలో సాయిరాజ్ కాలువ వడ్లమన్నాడు డ్రాప్ నుంచి కూడూరు ఎట్టిగుంట వరకు లంక కాలువలో తూటు, గుర్రపు డెక్క, తూటుకాడ తొలగింపు పనులు గత రెండు రోజులుగా కొనసాగుతున్నాయి.
దావోజిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కాగిత నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నారు. సాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాలువల శుభ్రతతో నీటి ప్రవాహం మెరుగుపడి రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు. కాలువ ఇరువైపులా ఉన్న రైతులు ఈ పనులపై హర్షం వ్యక్తం చేస్తూ, సాగునీటి సమస్య పరిష్కారానికి ఇవి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
