చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం..

  • మంత్రి కోమటిరెడ్డికి చైర్‌పర్సన్ కృతజ్ఞతలు

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల నుంచి భువనగిరి వరకు ప్రతిరోజూ ప్రయాణించే ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రహదారి విస్తరణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టడంతో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ హర్షం వ్యక్తం చేశారు.

రామన్నపేటలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సుమారు రూ.240 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ యాక్టివా ద్విచక్ర వాహనంపై కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీగా రామన్నపేటకు బయలుదేరారు.