ఆంద్రప్రభ ఎఫెక్ట్.. డైవర్షన్ రోడ్డు ఏర్పాటు
- బైక్ లు,కార్లు వెళ్లేందుకు మార్గం సుగమం
మోత్కూర్, ఆంద్రప్రభ : చెరువు కట్టకు మరమ్మతులు-పూర్తిగా రాకపోకలు బంద్,డైవర్షన్ రోడ్డు లేక ప్రయాణికులు, రైతులు,కూలీలు, ఉద్యోగుల అవస్థలు అనే శీర్షికతో జూలై 10 న ఆంద్రప్రభ లో వచ్చిన కథనానికి స్పందించిన కాంట్రాక్టర్ తాజాగా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు, రైతులు,కూలీలు, ఉద్యోగుల తిప్పలు తప్పాయి.మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ (చెరువు కట్ట ) గతేడాది కుంగడంతో మరమ్మతుల కోసం రూ.36 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో కాంట్రాక్టర్ ఇటీవల మరమ్మతు పనులు ప్రారంభించారు.
ఈ రూట్లో బస్సులు, భారీ వాహనాలు వెళ్లకుండా పాటిమట్ల,అనాజీపురం మీదుగా వాహనాలు దారి మళ్లించారు.కానీ చెరువు కట్ట కుంగిన ప్రాంతంలో కనీసం బైక్,కారు,ఆటో సైతం వెళ్లకుండా కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో రోడ్డు కూల్చడంతో రైతులు, ఉద్యోగులు,కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కనీసం డైవర్షన్ రోడ్డు వేయకుండా పూర్తి స్థాయిలో రోడ్డు ను కూల్చి వేసి మరమ్మతులు చేయడంతో ఆంద్రప్రభ వెబ్ న్యూస్,పత్రికలో వచ్చిన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించి తక్షణమే డైవర్షన్ రోడ్డు వేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ని ఆదేశించడంతో సదరు కాంట్రాక్టర్ డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. దీంతో ఈ రూట్లో కార్లు,బైక్ లు,ఆటోలు యథేచ్ఛగా వెళ్లడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలిగాయి.
