పెద్దమ్మ తల్లి గుడి కమిటీ ఎన్నిక..
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం రోజున గుడి ఆవరణలో ముదిరాజ్ సంఘం పెద్దమనుషులు కంబాల రమేష్, బొజ్జ సతీష్, కాటంరాజు, బొజ్జ గోపాల్, బొజ్జ రవీందర్ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి గుడి కమిటీని చైర్మన్ గా కంబాల శ్రీను , వైస్ చైర్మన్ బొజ్జ శ్రీధర్ క్యాషియర్ బొజ్జ నవీన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కమిటీ డైరెక్టర్లుగా పోలు కిరణ్, బొజ్జ తిరుపతి, బొజ్జ స్వామి, సతీష్ మేస్త్రి, కిరణ్, రాహుల్, పోలు పవన్ కుమార్, ఓంతేజ, చందులు ఎన్నుకోబడ్డారు. నూతనంగా ఏర్పడిన కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముదిరాజ్ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సహకారంతో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
