రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ..

మోత్కూర్, ఆంద్రప్రభ : కరీంనగర్ ఎంపీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా శనివారం మున్సిపల్ కేంద్రంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్,శారదా క్లినిక్ లో రోగులకు పండ్లు ,బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బండి సంజయ్ సాధారణ కార్యకర్త స్థాయి నుండి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగి, నేడు కేంద్ర మంత్రిగా దేశ సేవలో కొనసాగుతున్న ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, జాతీయవాద భావజాలాన్ని బలోపేతం చేయడంలో, పార్టీ బలోపేతానికి చేసిన సేవలు వారి నాయకత్వంలో మరెన్నో విజయాలు సాధించి, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని , భగవంతుడు ఆయురారోగ్యాలు, అఖండ విజయాలు, సుఖశాంతులు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చేపట్టే ప్రతి కార్యం విజయవంతమై, భారత మాత సేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు చాడ మంజుల ,జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్ , మాజీ పట్టణ అధ్యక్షులు పోచం సోమయ్య, పట్టణ కార్యదర్శి ముత్తినేని తిరుమలేష్, నాయకులు చేకూరి మల్లేశం, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు