పట్టపగలే అక్రమ మట్టి రవాణా.. అధికారుల తీరుపై విమర్శలు

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండలంలో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే పట్టపగలు అక్రమంగా మట్టి తరలింపు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ వాహనాలతో మట్టి రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

మండలంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తవ్వి తరలిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి రవాణాపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తహసీల్దార్ వివరణ…

ఈ విషయమై తహసీల్దార్ సర్వర్ను సంప్రదించగా, తమ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఘటనపై విచారణ కోసం జీపీఓను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమ మట్టి రవాణాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.