బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

రూ.2.46 లక్షల ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

వేల్పూర్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకూడ గ్రామానికి చెందిన బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పంపిణీ చేశారు.

లబ్ధిదారులైన నిమ్మల అరవింద్, చేపూరి ముత్తెన్న, హోటల్ రామవ్వ, బొమ్మకంటి హనుమగౌడ్, ఈదుల్లా వంశీ, సుంకరి లక్ష్మి, కుమ్మరి లింగన్న, చేపూరి గంగు, ఎక్కడ రమేష్‌లకు కలిపి మొత్తం రూ.2,46,800 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అక్షరాల రూ.2 లక్షల 46 వేల 800 ఆర్థిక సాయాన్ని మంజూరు చేసిందన్నారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్ కుమార్‌తో పాటు ప్రభుత్వం, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.