హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని మోటార్ బ్యాక్ ర్యాలీ…

హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని మోటార్ బ్యాక్ ర్యాలీ…

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : డివిజన్ కేంద్రంలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నేడు సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో జరిగే హిందూ సమ్మేళనం సమావేశంలో విజయవంతం చేయాలని కోరుతూ సేవా సమితి ఆధ్వర్యంలో పాటిమీద ఉన్న హనుమాన్ మందిరం నుండి ఈ ర్యాలీని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సురేష్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ మోటార్ బైక్ ర్యాలీ గెస్ట్ హౌస్ సెంటర్ నుండి గాంధీ సెంటర్ అంబెడ్కర్ సెంటర్ నుండి కొనసాగి దుబ్బ తండా వద్ద ఉన్న హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ భక్తులతో ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్ మీదుగా పాల కేంద్రం వద్ద ఉన్న పక్కాంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు చేసి సమావేశం స్థలం వద్ద ముగిసింది. సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చా సురేష్ సమితి సభ్యులు గుజరాతి శివకుమార్ ఇమ్మడి రాంబాబు లు మాట్లాడుతూ.. జిల్లాలో ముఖ్య కేంద్రమైన తొరూర్ లో ఈ సమావేశం నిర్వహించడం ద్వారా హిందువులను జాగ్రత్తపరిచేందుకు ఐక్యమత్యాన్ని హిందూ ధర్మ పరిరక్షణకు జరిగే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాస్ జంజిరాల నాగరాజు హరిబాబు పత్తి లక్ష్మణ్ రుద్రదేవ్ పార్ధు సోమయ్య డాక్టర్ రామారావు తో పాటు, రేగురి శ్రీనివాస్ రమేష్ లు సుమారు 200 మంది మోటర్ బైక్ లతో హనుమాన్ మాల వేసిన భక్తులు పాల్గొన్నారు.