విద్యార్థుల భద్రతకు పెద్దపీట..

ప్రమాదకర విద్యుత్ బుడ్డి తొలగింపు

మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ బుడ్డిని విద్యుత్ శాఖ అధికారులు తొలగించి మరో ప్రాంతానికి తరలించారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ జిట్టగోని సైదమ్మ–సైదులు సమస్యను మునుగోడు విద్యుత్ శాఖ ఏఈ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి విద్యుత్ బుడ్డి షిఫ్టింగ్‌కు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ జిట్టగోని సైదమ్మ–సైదులు మాట్లాడుతూ సమస్యను వెంటనే పరిష్కరించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన మునుగోడు ఏఈతో పాటు విద్యుత్ శాఖ సిబ్బందికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఇదే తరహా సత్వర స్పందన కొనసాగించాలని కోరారు.