రైతులకు యూరియా కొరత లేదు – జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లాలో యూరియా లభ్యతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. శనివారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో రైతుల అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి రైతుకు, ప్రతి పొలానికి అవసరమైన మేర యూరియా సరఫరా చేసేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
యూరియా సరఫరా పై ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు వ్యవసాయ పనులు కొనసాగించాలని అన్నారు.
