ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే డా. రామచంద్ర నాయక్
మరిపెడ, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో భాగంగా మరిపెడ మండలం, మరిపెడ మున్సిపాలిటీలో నిర్వహించిన సహాయ శిబిరంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రామచంద్ర నాయక్ తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఓటరు నమోదు, సవరణకు సంబంధించిన ఫారాలను పి.ఎల్.ఓ ఉమా కు అందజేశారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటరు వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు పూర్తి చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ పెండ్లి రఘువీరా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ గుగులోతు రవి నాయక్ , జిల్లా ప్రధాన కార్యదర్శి విశారపు శ్రీపాల్ రెడ్డి , మరిపెడ మున్సిపాలిటీ బీఎల్ఏ సూపర్వైజర్ అక్కినపల్లి వెంకట సాయి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
