రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు
శుభాకాంక్షలు తెలిపిన మడికొండ శ్రీను
పరకాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ కోఆర్డినేటర్ నగరిగారి ప్రీతమ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ కో-ఆర్డినేటర్, యువకుడు, ఉత్సాహవంతుడు, ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకునేటువంటి ముందుచూపుగల నాయకుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి నాగరిగారి ప్రీతమ్ పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాదులో నాగరిగారి ప్రీతమ్ ను పరకాల పట్టణ వాస్తవ్యులు, టిపిసిసి ఎస్సి సెల్ రాష్ట్ర కమిటీ వైస్- చైర్మన్, నేషనల్ డాక్టర్. బిఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత డాక్టర్ మడికొండ శ్రీను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ రాష్ట్ర చైర్మన్, దళితరత్న దబ్బేట రమేష్ , టీపీసీసీ రాష్ట్ర కన్వీనర్లు, దళితరత్న నత్తి కౌర్నీల్, దళితరత్న అర్షం అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకులు బొజ్జం సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
