పాఠాలు బోధించిన కలెక్టర్

పాఠాలు బోధించిన కలెక్టర్

  • బోధన సామర్ధ్యాలపై విద్యార్థినీలకు కలెక్టర్ ప్రశ్నలు
  • ఉన్నతమైన విద్య… భవిష్యత్ కి పునాది
  • విద్యార్థినిలు లక్ష్యానికి అనుగుణంగా ఉన్నతంగా ఎదగాలి
  • జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ, ఆంధ్రప్రభ : విద్యార్థినిలు నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకొని, అందుకు అనుగుణంగా ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లాలోని చౌడారం కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం) పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, విద్యార్థినుల వసతి, భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించారు.

అలాగే ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. వారి బోధన సామర్థ్యాలను పరీక్షించి వాటిపై అవగాహన కల్పించి పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా గణితంపై పట్టు సాధించాలని సూచించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని, విద్యార్థినులకు మంచి వాతావరణంలో బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదే విధంగా విద్యార్థినులు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రోత్సహించారు. పాఠశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ పరిశీలనలో ఎస్ఓ రాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply