పెయింటర్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెయింటర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం శుక్రవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మంద భాస్కర్ యాదవ్, జిల్లా అధ్యక్షులుగా నాంసాని నర్సయ్య, ఉపాధ్యక్షులుగా దావల్ల రవి, అరికోల్ల వెంకటేష్, బండారి శ్రీనివాస్, కార్యదర్శిగా మినుముల సది, క్యాషియర్లుగా చంద్రగిరి సుమన్, పల్లె విజయ్, సలహాదారులుగా మెంగని నాగరాజు, తాడం ప్రసాద్, గడ్డం శంకర్, గరిగంటి రాజేందర్, మహ్మద్ తాజ్, ఆర్గనైజర్లుగా శనిగరం నాగరాజు, గడ్డం లక్ష్మణ్ నియమితులయ్యారు.
నూతన జిల్లా అధ్యక్షులు నాంసాని నర్సయ్య మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత పెయింటర్లందరూ ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని, భవన నిర్మాణ రంగ కార్మికులంతా ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తమ వృత్తికి, ఇంటి యజమానులకు తగిన గౌరవాన్ని ఇస్తూనే, సభ్యుల సమస్యల పరిష్కారానికి,సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కల్లపెల్లి రవిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన పెయింటర్లు పాల్గొన్నారు.
