సర్ విధానాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జెసి నవీన్

బి ఎల్ ఓ లకు సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి ప్తి

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చడానికి ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ చేపట్టింది అందులో భాగంగా రామవరపాడులో జరుగుతున్న సర్ విధానాన్ని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ గురువారం ఆకస్మికంగా ఏర్పాటు చేశారు. సర్ విధానంలో బిఎల్ఓ లు ఈ విధంగా చేస్తున్నారు పరిశీలించారు. సర్ విధానములో బిఎల్ఓ లు జాగ్రత్తగా ఉండాలని ఇటువంటి తప్పులు జరగకుండా ఓటర్లు దగ్గర నుంచి వివరాలు సేకరించి పట్టికలో పూర్తి చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సర్ అర్హత తేదీ ఈనెల బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ఓటర్ల నుంచి వివరాల సేకరించాలని సూచించారు. వాటర్ జాబితా ప్రచురణ ఆగస్టు 21వ తేదీన ప్రచురించబడుతుందని ట్రైన్లు అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 20 వరకు ఉంటుందని తెలిపారు. ఓటర్లలో లిస్టులో తేడాలు ఉంటే ఓటరు సరిచేసుకోవాలని సూచించారు తుది ఓటరు జాబితా సెప్టెంబర్ 22వ తేదీన ప్రచురించబడుతుందని తెలిపారు. ఈనెల 14వ తేదీ లోపు సర్ సర్వేలో బి ఎల్ ఓ లకు సహకరించి ఓటర్ వివరాలు వారు అడిగిన పత్రాలు సమర్పించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవో పార్థసారథి తదితరు లు ఉన్నారు.