రోడ్డుపై బైఠాయించిన ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు

అనంతపురం బ్యూరో, (ఆంధ్రప్రభ): రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వం తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

మహిళలు ఇంట్లో ఉన్న విషయం తెలిసినా మహిళా పోలీసులను పంపకుండా పురుష పోలీసులు బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహించారని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో అనంతపురం నగరంలో ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పేర్కొన్నారు.

తమ ఇంటి చుట్టూ ముళ్లకంచెలు ఏర్పాటు చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించిన కుటుంబ సభ్యులు, ఈ వివాదానికి కారణమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ముందుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.