రాజ్యాధికారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి
రాజ్యాధికారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి
- ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు రాజు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ:
మాదిగల రాజ్యాధికారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉరవకొండ పట్టణంలోని మాదిగ అమరవీరుల స్మారక స్థూపం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎంతో మంది మాదిగలు ప్రాణత్యాగం చేశారని, పలువురు జైలు జీవితం గడిపారని తెలిపారు. అనుకున్న లక్ష్యానికి దగ్గరగా చేరుకున్నామని పేర్కొన్నారు. ఏబీసీడీ వర్గీకరణ సాధించుకున్నామని, ఇప్పుడు మాదిగల రాజ్యాధికార సాధన కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని మాదిగలందరూ ఈ దిశగా ఏకమవ్వాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు కౌకుంట్ల రవి, ఉరవకొండ తాలూకా అధ్యక్షుడు రాంపురం చెన్నప్ప, ప్రధాన కార్యదర్శి కౌకుంట్ల సురేష్, పార్లమెంట్ డివిజన్ అధ్యక్షుడు వెలగొండ ఓబన్న, జిల్లా నాయకులు రామాంజనేయులు, నియోజకవర్గ నాయకుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
