ఆటోను తప్పించే ప్రయత్నంలో డివైడర్‌ను ఢీకొన్న లారీ

తొర్రూరు (ఆంధ్రప్రభ): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఉదయం లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. వెనుక నుంచి వస్తున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

నాగ్‌పూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ముందు టైరు ఊడిపోయి వాహనం అక్కడికక్కడే నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉన్నారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.