కోర్టు, సబ్ జైలును పరిశీలించిన జిల్లా ఇన్చార్జి జడ్జి

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని కోర్టును, సబ్ జైల్ ను జిల్లా కోర్టు ఇంఛార్జి జడ్జి పరిశీలించారు. శనివారం హనుమకొండ జిల్లా కోర్టు ఇంఛార్జి జడ్జి అపర్ణాదేవి విచ్చేసి పరకాల పట్టణంలోని కోర్టును, పరకాల సబ్ జైలును పరిశీలించారు. ఈ సందర్భంగా జైలు అధికారులకు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో జిల్లా ఇంఛార్జి జడ్జి అపర్ణాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్చార్జి జడ్జి వెంట సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.