చంద్రగిరిలో బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

చంద్రగిరిలో బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

  • 8 ఏళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడి దారుణం
  • చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

తిరుపతి, ఆంధ్ర‌ప్ర‌భ : చంద్రగిరిలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఘటన అనంతరం బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ఘటనపై అనుమానం వ్యక్తం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందిత బాలుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా, తమకు బెదిరింపులు ఎదురయ్యాయని ఆరోపించారు. నిందితుడు గంజాయి వినియోగించే యువకుల బృందానికి చెందినవాడని వారు పేర్కొన్నారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరే చిన్నారికి జరగకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై చంద్రగిరి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply