Anantapur-High-Tension : అనంత టెన్షన్ Andhra Prabha Top News

Anantapur-High-Tension : అనంత టెన్షన్ Andhra Prabha Top News

  • ప్రకాష్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
  • టిడిపి కార్యకర్తల సమావేశం
  • రాజు ఇంటి వద్ద మొహరించిన పోలీసులు
  • చుట్టూ బారికెట్లు ఏర్పాటు

( అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ)

Anantapur-High-Tension : అనంతపురంలో హై టెన్షన్ చోటుచేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న ప్రకాష్ రెడ్డి నివాసం చుట్టూ భారీ మార్కెట్లు ఏర్పాటు చేసి, ఇనుప ముల్లకంచెను ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు ప్రకాష్ రెడ్డి నివాసం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రకాష్ రెడ్డి నివాసంలో అణువణున తనిఖీలు చేశారు. సర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి ప్రవేశించి గదులన్నీ పరిశీలించారు.
ఇదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నివాసం వద్ద పోలీసులు బందోబస్తు లో ఉన్నారు.
తాను అక్రమ ఆస్తులు సంపాదించానని దానిని నిరూపించాలని ఎమ్మెస్ రాజు, ప్రకాష్ రెడ్డికి సవాల్ చేశారు. ఈమెరకు గురువారం ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వస్తానని రాజు మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున అనంతపురానికి చేరుకున్నారు. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరుతుందనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ జగదీష్ ముందస్తుగా పోలీసులను మోహరింపజేశారు. తనమీద హత్యాయత్నం జరిగిందని టిప్పర్ తో ఢీకొట్టే ప్రయత్నం చేశారని ప్రకాష్ రెడ్డి గతంలో ఆరోపణ చేశారు. దీనిపై వివరణ ఇచ్చే క్రమంలో భాగంగా ఎమ్మెస్ రాజు, పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ముదిరిపోయింది. జిల్లాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజుకు మద్దతు తెలిపారు. ముఖ్యంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు రాజుతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
అనవసరంగా తమపై రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రకాష్ రెడ్డి కుటుంబం ఆరోపించింది.