ఇసుక వాహనదారుల ఆందోళన
- ఒకే రోజు ఆన్లైన్,టోకెన్ లతో ఇసుక సరఫరా
- ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆగిపోయిన ఇసుక సరఫరా
మద్దూర్, ఆంధ్రప్రభ: కొత్తపల్లి మండల పరిధిలోని లింగల్ చేడ్ గ్రామ శివారులోని పెద్ద వాగు నుంచి ప్రభుత్వం ఇసుక రవాణా సరఫరా కొనసాగుతుంది. బుధవారం రోజు టోకెన్ మరియు ఆన్లైన్ ద్వారా రవాణా జరుగుతుందని సమాచారం మేరకు ఇసుక వాహనదారులు ట్రాక్టర్ లోడ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ఇసుక మాత్రమే సరఫరా జరుగుతుంది అన్ని ఎస్ఆర్ఓ తెలిపారు.ఇసుక ట్రాక్టర్లు అక్కడి నుంచి కదలకుండా సాయంత్రం వరకు నిల్చిపోవడం జరిగింది.
ఆన్లైన్ ఇసుక సరఫరా సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఉదయం నుంచి ఇసుక సరఫరా చేయకుండా సాయంత్రం 4 గంటల 45నిమిషాలకు ఇసుక సరఫరా కొనసాగించారు. సాయంత్రం 5 గంటలు దాటినా తర్వాత ఇసుక సరఫరా చేయడం కానీ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం టోకెన్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చిన అధికారులు ఇసుక ట్రాక్టర్ పంపియకపోవడంతో అధికారుల నిర్లక్ష్యంతో ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు ఇసుక లోడ్ తో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలు దాటినా పడిగాపులు కస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


