వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
చెన్నూర్, ఆంధ్రప్రభ; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బడుగు, బలహీన వర్గాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్సార్ హయాంలో 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి బడుగు, బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ప్రజా సంక్షేమ పాలన నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్, కౌన్సిలర్ అజీమ్, నాయకులు పెద్దింటి శ్రీనివాస్, చెన్న సూర్యనారాయణ, కొంపెల్లి బానేష్, చెన్నూరి రాజేష్, సుషీల్ కుమార్, బ్రహ్మయ్య, గజ్జెల అంకా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
