తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి అనగాని

ఉయ్యూరులో నూతన రెవెన్యూ కార్యాలయం ప్రారంభం
శిలాఫలకం ఆవిష్కరించిన మంత్రి.. పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు

ఉయ్యూరు, ఆంధ్రప్రభ: ఉయ్యూరు మండలంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తదితరులు పాల్గొన్నారు.