ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు అందించాలి
బాపట్ల, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ప్రత్యేక సబ్సిడీ రుణాలు అందించి స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పించాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు కోరారు. బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్‌కు గోగన ఆదిశేషు, కోకి రాజశేఖర్ కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యాపారం చేసుకునే దివ్యాంగులకు తోపుడు బండ్ల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు తగిన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్, ఈ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
