వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
భీమ్‌గల్ టౌన్ (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమ పాలనకు ఆయన ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, టౌన్ అధ్యక్షుడు పర్శ అనంత్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆరిగెల జనార్దన్, కౌన్సిలర్ అంజుమ్, నాయకులు రాడే బలరాం, వాక మహేష్, నవీన్, అనిల్, బొర్రన్నతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
