రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
- జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు
డోంగ్లి, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని సహకార సంఘ ఆవరణలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంగళవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నకు 2400 మద్దతు ధర కల్పించిందని రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని అన్నారు. అనంతరం వీరిని సహకార సంఘం చైర్మన్ రమేష్ పటేల్ శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి, సంఘం ఉపాధ్యక్షులు విజయ్ పాటిల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు లక్ష్మణ్ బచావార్,డిసిసి వైస్ ప్రెసిడెంట్ యూనుస్ పటేల్, సర్పంచ్ లు సంగ్రామ్ పటేల్,దత్తు,బస్వరాజ్ పటేల్,శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్,నాయకులు విలాస్ పటేల్,వసంత్ పటేల్,ధనంజయ్ పటేల్,చాంద్ పటేల్,శివ రెడ్డి, విలాస్ గైక్వాడ్, అప్సర్ పటేల్,సుభాస్ పటేల్ జుక్కలే,డా.రాజేందర్ సంఘం కార్యదర్శి బాబు రావ్ పటేల్,ఉప కార్యదర్శి వీరేష్ సిబ్బంది ప్రవీణ్,ఇర్వంత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
