గుడిసెల సర్వేతో ఇందిరమ్మఇళ్ల ప్రక్రియ వేగవంతం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని కొల్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో భాగంగా ఎంపీడీవో పావని మంగళవారం గుడిసెల సర్వే నిర్వహించారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి ఈ సర్వే చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరించాలని ఆమె కోరారు.
అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజల ఆర్థిక స్థితిగతులు స్వయంగా పరిశీ లించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం చేపడుతున్న గుడిసెల సర్వే పారదర్శకంగా చేపట్టిఅర్హులైననిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రజలు గుడిసెలో సర్వే కార్యక్రమానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూర్ సర్పంచ్ సింగారం సువర్ణ శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ ఏఈ ప్రేమ, పంచాయతీ కార్యదర్శి తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
