మాదిగలకు అండగా కూటమి ప్రభుత్వం.

ఎమ్. ఆర్. పి. ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.

పాయకాపురం, ఆంధ్రప్రభ : మాదిగలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎమ్. ఆర్. పి. ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం పాయకాపురం, సుందరయ్య నగర్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఎమ్.ఆర్. పి. ఎస్ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఎమ్.ఆర్.పి.ఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా శ్రేణులతో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ మాదిగలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు.ఎస్. సి వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్. ఆర్. పి. ఎస్ అనేది ఒక వర్గానికి చెందినది కాదని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి, పరిష్కారానికి మందా కృష్ణ పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కంపాటి వెంకటేశ్వరరావు మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి లింగాల నరసింహులు, సెంట్రల్ కో.ఇంచార్జి చప్పిడి కాశీ, నందేటి ప్రేమ్,పైడి శ్రీను, గౌసియా, బుదాల సురేష్, ఆకుల సూర్యప్రకాష్, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.