గ్రంథాలయానికి టేబుల్లు, కుర్చీలు అందజేసిన స్థానిక ఎమ్మెల్యే
నందిగామ, ఆంధ్రప్రభ : గ్రంథాలయం అనేది ప్రజల ఉపయోగం కొరకు పుస్తకాలు పత్రికలు ఇతర సమాచార వనరులను క్రమ పద్ధతిలో ఉంచి పాఠకులకు అందిస్తుందని అదేవిధంగా ఉన్నత విద్యను చేరుకునేందుకు కాంపిటేషన్ పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎం ఎస్ బిగ్అన్నారు. మంగళవారం స్థానిక గ్రంథాలయంలో వారు గ్రంధాలయంలోని విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా గ్రంథాలయం పరిశుభ్రంగా స్థానికులకు విద్యార్థులకు అందుబాటులో ఉంచిన గ్రంథాల అధికారి అల్లూరిరామచంద్రుని వారు అభినందించారు.
స్థానిక శాసనసభ్యులు గ్రంథాలయానికి అవసరమైన కాంపిటేషన్ పుస్తకాలతో పాటు కుర్చీలు బల్లలు కొనుగోలు నిమిత్తం 20000 అందజేశారు. కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం ఎస్ బేగ్ తో కలిసి సౌమ్య గ్రంథాలయానికి గ్రంథాలయ పాటకుల అవసరార్థం కుర్చీలు,రీడింగ్ టేబుల్, కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ 20,000 విలువైనవి కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బేగ్ కి, కృష్ణాజిల్లా గ్రంథాల సంస్థ కార్యదర్శి వేములపల్లి రవికుమార్ గారికి అందజేశారు. కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ గ్రంథాలయానికి సప్లై చేసిన పుస్తకాలను, పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్యే రెబ్బెన కట్ చేసి ప్రారంభించారు, అనంతరం గ్రంథాలయ ఆవరణము నందు చైర్మన్ బేగ్ తో కలిసి మొక్కలు నాటినారు , ఈ కార్యక్రమంలో రాము కూటమినాయకులు పాల్గొనడం అయినది, గ్రంథాలయ అధికారి అల్లూరు రామచంద్రుడుఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం అయినది.
