అంతర్జాతీయ అవార్డు

కలెక్టర్ వినోద్ అభినందనలు అందుకున్న ఫోటోగ్రాఫర్ పి.వి.ఎస్. నాగరాజు

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్లకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పి.వి.ఎస్. నాగరాజు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం–2026 సందర్భంగా కేఏ టీవీ ఫోటోగ్రఫీ వరల్డ్, కలకత్తా సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ ఫోటోగ్రఫీ పోటీలో ఆయన తీసిన ఛాయాచిత్రానికి బెస్ట్ అవార్డు లభించింది. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ యోగా సాధన చేస్తున్న క్షణాన్ని ప్రతిబింబిస్తూ నాగరాజు తీసిన ఫోటో ఈ అవార్డుకు ఎంపికైంది.

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు సుజాత మండల్ సోషల్ మీడియా ద్వారా నాగరాజుకు అభినందనలు తెలియజేశారు. అవార్డు సాధించిన సందర్భంగా బాపట్లకు చెందిన ఫోటోగ్రాఫర్లు డా.పి.వి.ఎస్. నాగరాజును అభినందించారు. మంగళవారం డా.పి వి ఎస్. నాగరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కలెక్టర్ బృందం యోగా సాధన చేస్తున్న ఫోటోను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, డా.పి.వి.ఎస్. నాగరాజును అభినందిస్తూ, ఆయన మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.