తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన అధ్యక్షుడిగా పోసాని రాజేష్

తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన అధ్యక్షుడిగా పోసాని రాజేష్
తొర్రూరు, ఆంధ్రప్రభ: తెలంగాణ రాజ్యాధికార పార్టీ తొర్రూరు మండల యువజన అధ్యక్షుడిగా పోసాని రాజేష్ నియమితులయ్యారు. మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన పోసాని రాజేష్‌కు పార్టీ యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి బండి సంతోష్ గౌడ్ గురువారం నియామక పత్రాన్ని అందజేశారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం, యువజన రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ సూచనల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా పోసాని రాజేష్ మాట్లాడుతూ, అంకితభావం, నిబద్ధతతో పనిచేసి పార్టీ రాజ్యాధికార భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. పార్టీని బలోపేతం చేసి సంస్థాగత నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు.
