Telangana Politics | కొండా సురేఖ Vs కడియం శ్రీహరి

కడియం శ్రీహరిపై కొండా సురేఖ ఫిర్యాదు..

Telangana Politics | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

కడియం శ్రీహరి తీరుపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ పెద్దలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో కడియం జోక్యం చేసుకుంటున్నారనే అభ్యంతరాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఇటీవల వరకు ఇద్దరు నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలంగా వీరి మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించినా, తాజా పరిణామాలతో మరోసారి విభేదాలు బయటపడుతున్నాయి.

ఇటీవల కడియం శ్రీహరి తన నియోజకవర్గానికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఈ పరిణామంపైనే కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లా రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతల మధ్య నెలకొన్న ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.