players| వార్ ఎఫెక్ట్‌.. క్రికెట‌ర్ల‌కు తిప్ప‌లు

players| వార్ ఎఫెక్ట్‌.. క్రికెట‌ర్ల‌కు తిప్ప‌లు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావ‌ర‌ణం
విమానాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం
భార‌త్‌లో చిక్కుకున్న వెస్టిండీస్, జింబాబ్వే క్రికెట్ జ‌ట్లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావ‌ర‌ణం అలుముకోవ‌డంతో వెస్టిండీస్, జింబాబ్వే క్రికెట్ జట్లకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆ జ‌ట్లు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే వారు భార‌త్ నుంచి వారి స్వదేశానికి తిరిగి వెళ్లలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులు, ప్రతిగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సాధారణంగా భారత్ నుంచి కరేబియన్ దేశాలకు లేదా ఆఫ్రికా దేశాలకు వెళ్లే విమానాలు దుబాయ్ మీదుగా ప్రయాణిస్తాయి. అయితే, ఇరాన్ జరిపిన ప్రతిదాడిలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతినడం, గల్ఫ్ ప్రాంతంలో వైమానిక దాడుల ముప్పు ఉండటంతో విమాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే జ‌ట్లు భార‌త్‌లోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది.

Leave a Reply