ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా…
విద్యార్థినులకు ప్యాడ్లు, పండ్ల పంపిణీ
మాదిగల హక్కుల సాధన కోసం ఉద్యమం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ నేతల స్పష్టం
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ సూపర్ బజార్ ప్రాంతంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రాచర్ల సురేష్ మాదిగ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ముందుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించి, కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక బాలికల పాఠశాలలో విద్యార్థినులకు పరీక్షలు రాసుకునే ప్యాడ్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాచర్ల సురేష్ మాదిగ మాట్లాడుతూ, మాదిగల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎస్ గత 32 ఏళ్లుగా నిరంతర పోరాటం చేస్తోందని, ఆ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల వర్గీకరణ అమలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లూరు కళ్యాణ్, ఆరుముళ్ల పోశం, కాదాసీ సంపత్, కన్నూరి రాజేందర్, ఆవునూరి గట్టయ్య, రామిల్ల మల్లేష్, దాసరపు ఆగయ్య, మారపల్లి రాజయ్య, ఎల్లసాని శ్రీనివాస్, సలిగముల రమేష్, ఎంఎస్ఎఫ్ నాయకులు మారపల్లి సాయికుమార్, రేణిగుంట్ల అఖిల్, కలువల శ్రీనివాస్, కిరణ్, డప్పు కళాకారులు చిర్ర వెంకటి, తుంగ వెంకటేష్, గుడిసెల రమేష్, రెల్లి సంఘం నాయకులు నాగరాజు, ప్రసాద్, ఎంఎస్పి నాయకులు దుప్పటి రాజు, రేణిగుంట్ల ఈశ్వర్ పాల్గొన్నారు.
