ఓటర్ ఎన్యుమరేషన్ పురోగతిని పరిశీలించిన ఆర్డీవో శ్రీదేవి

మునుగోడు, జూలై 7 (ఆంధ్రప్రభ): నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని చండూర్ ఆర్డీవో శ్రీదేవి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మునుగోడు తహసీల్దార్ నేలపట్ల నరేష్‌తో కలిసి కేంద్రాన్ని సందర్శించిన ఆమె, ఓటర్లతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా నింపే విధానంపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఇప్పటివరకు సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల వివరాలను బీఎల్‌ఓను అడిగి తెలుసుకుని, సుమారు 50 శాతం ప్రక్రియ పూర్తవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

మిగిలిన ఎన్యుమరేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆర్డీవో సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు బీఎల్‌ఓలు, స్థానిక నాయకులు, సిబ్బంది అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గీత, బీఎల్‌ఏ యశోద, బీఎల్‌ఓ కుంభం చెన్నారెడ్డి, పోగుల ప్రకాష్, పిట్టల రఘు, కుంభం సురేందర్ రెడ్డి, ఉప్పునూతల లింగస్వామి, జంగం చంద్రశేఖర్, గురిజ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.