టిపిసిసి చీఫ్ ను కలిసిన శ్రీనివాస్ గౌడ్
టిపిసిసి చీఫ్ ను కలిసిన శ్రీనివాస్ గౌడ్
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ టిపిసిసి చీఫ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులో జరిగిన కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల శామ్యూల్, రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సభ్యులు సుధీర్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ నూనె ముంతల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
