విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించబోము..
విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించబోము..
భూపాలపల్లి ఎమ్మెల్యే. జీ ఎస్సార్..
రేగొండ , ఆంధ్రప్రభ : విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రేగొండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్ల సమస్యపై విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే, భవన యజమానిని పిలిపించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోట కొత్త మరుగుదొడ్లు, నీటి నల్లాలు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందిస్తున్నామని, సమస్యలు ఉంటే నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ జీవన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ మౌనిక, ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
