అన్నా క్యాంటీన్‌లో ఆకస్మిక తనిఖీ..
అన్నా క్యాంటీన్‌లో ఆకస్మిక తనిఖీ..
ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆర్డీవో ఏ. కుమార్
టిఫిన్ కోసం వచ్చిన వారితో ఆహార నాణ్యతపై ఆరా
రుచి, పరిశుభ్రత, సేవలపై ప్రజల అభిప్రాయాల సేకరణ
క్యాంటీన్ నిర్వహణపై సిబ్బందికి కీలక సూచనలు
తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని అన్నా క్యాంటీన్‌ను ఆర్డీవో ఏ. కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం టిఫిన్ కోసం వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి ఆహార నాణ్యత, రుచి, పరిశుభ్రత, సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తిరువూరులోని అన్నా క్యాంటీన్‌ను ఆర్డీవో ఏ. కుమార్ ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. క్యాంటీన్‌లో అందిస్తున్న అల్పాహారం నాణ్యత, రుచి, పరిశుభ్రత ప్రమాణాలపై ప్రజలను స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. సేవల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనే అంశంపై ఆరా తీశారు. అనంతరం క్యాంటీన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఆర్డీవో, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వినియోగదారులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా చేరేలా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ డి. చంద్రమౌళి, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
