‘మెంబర్షిప్ టు లీడర్షిప్’తో జనసేన కొత్త అడుగు..
గుడివాడ నుంచి భారీగా తరలిన సాధకులు
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి అవకాశం.. బయోడేటాల సమర్పణకు మచిలీపట్నం చేరిన జనసేన శ్రేణులు
గుడివాడ, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నిర్మాణ సాధకుల సమాచార సేకరణ’ కార్యక్రమానికి గుడివాడ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, సాధకులు, వీర మహిళలు భారీ సంఖ్యలో మచిలీపట్నంలోని సమాచార సేకరణ వేదికకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న వారి దరఖాస్తులను మచిలీపట్నం పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ పరిశీలకుడు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌కు అందజేస్తున్నట్లు తెలిపారు.
గుడివాడ నియోజకవర్గం నుంచి సుమారు 100 మంది సాధకులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. జనసేన పార్టీ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు కావాలనే సంకల్పంతో తమ బయోడేటాలను పార్టీ దృష్టికి సమర్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు సందు పవన్, పంచకర్ల అమర్, కోయిలాపు రాము, పెద్ది కిషోర్, కూరపాటి విజయ్, కోటపల్లి దాసు, సయ్యద్ నజీర్, గంట వంశీ, గొల్లపల్లి నాగబాబు, గంటా చైతన్య, అర్జ కృష్ణ, రాజేష్ పరుచూరి, వాసా నవీన్, వంగలపూడి రాము, గాడి కిరణ్, సీతాల రామకృష్ణ, గడ్డం శ్రీను, అలాగే వీర మహిళలు సీతాల సుభాషిణి, జడిమేను కనకదుర్గ, సూరత్ హిమజవల్లి, కొప్పర్తి విమలకుమారి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
