9 ఏండ్ల తరువాత ఆ గడ్డ మీద టీమిండియా..
- శ్రీలంకతో టెస్టు సిరీస్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భారత్ క్రికెట్ జట్టు 2026 ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు.
భారత్ జట్టు ఇప్పటివరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలవలేకపోయింది. రెండు సార్లు రన్నరప్‌గా నిలిచిన భారత్, ప్రస్తుతం 2025-27 సైకిల్ పాయింట్స్ టేబుల్‌లో 5వ స్థానంలో ఉంది. శ్రీలంక జట్టు 6వ స్థానంలో కొనసాగుతోంది. భారత్ చివరిసారిగా 2017లో శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడింది. ఆ పర్యటనలో 3-0తో క్లీన్ స్వీప్ విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ షెడ్యూల్ ఇలా ఉంది..
1వ టెస్ట్: ఆగస్టు 15 నుంచి 19 వరకు
గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
2వ టెస్ట్: ఆగస్టు 23 నుంచి 27 వరకు
సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో
ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్‌ను ఆడనుంది.
