ఫలక్‌నుమా ఆర్వోబీ జాతికి అంకితం..

ఫలక్‌నుమా ఆర్వోబీ జాతికి అంకితం..

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్‌లో( Hyderabad)ని పాతబస్తీ ప్రజలకు ఎన్నోఏళ్లుగా ఉన్న ట్రాఫిక్(traffic) స‌మ‌స్యఈ రోజుతో కొంత‌వ‌ర‌కు తీరుతుంది. సికింద్రాబాద్–ఫలక్‌నుమా(Secunderabad–Falaknuma) బ్రాడ్‌గేజ్ లైన్‌పై జీహెచ్ఎంసీ రూ.52.03 కోట్లతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Vijayalakshmi) ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, మీర్జా రహమత్ బేగ్(Mirza Rahmat Baig), ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, మీర్ జుల్ఫికర్ అలీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇప్పటికే ఉన్న పాత ఆర్వోబీని పునరుద్ధరించి, దానికి సమాంతరంగా కొత్త వంతెనను నాలుగు వరుసలతో నిర్మించారు. బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్‌నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వాహనాల రాకపోకలు సులభం కానున్నాయి. గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్(Traffic) సమస్య తొలగిపోనుంది.

Leave a Reply