ఎస్‌ఐఆర్ సర్వేలో పాల్గొన్న సర్పంచులు
జైనూర్, ఆంధ్రప్రభ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని సర్పంచులు పిలుపునిచ్చారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ, గూడెం మామడ, మాంకుగూడ గ్రామపంచాయతీల్లో గురువారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ సర్వేలో సర్పంచులు మడవి కౌసల్య భీమ్రావు, కుమ్ర యశోద కేశవరావు, కుమ్ర దేవుషా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచులు స్వయంగా సర్వే ఫారాలను నింపుతూ ప్రజలకు అవసరమైన సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు సర్వేలో పాల్గొని పూర్తి చేసిన ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని, ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
